కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్‌కు లైన్ క్లియర్..సుప్రీంకోర్టు కీలక ఆదేశం

కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలో బ్రేక్ పడిన థగ్ లైఫ్ మూవీకి లైన్ క్లియర్ అయింది

By Knakam Karthik
Published on : 17 Jun 2025 3:15 PM IST

Cinema News, Entertainment, Kamal Hassan, Thug Life, Karnataka, Supreme Court

కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్‌కు లైన్ క్లియర్..సుప్రీంకోర్టు కీలక ఆదేశం

కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలో బ్రేక్ పడిన థగ్ లైఫ్ మూవీకి లైన్ క్లియర్ అయింది. ఆ మూవీని కచ్చితంగా రిలీజ్ చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఒక రోజు సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అల్లరి మూకలు ఘర్షణలకు తెగబడకుండా చర్యలు తీసుకోవాలన్న సుప్రీం, ప్రజలను భయాలకు గురిచేయడం, థియేటర్లను తగలబెడతామన్న హెచ్చరికలను అనుమతించొద్దని హితవుపలికింది.

కమల్ హాసన్‌ను కర్ణాటక హైకోర్టు క్షమాపణ అడిగి ఉండకూడదని ధర్మానసం అభిప్రాయపడింది. ఈ వివాదానికి సంబంధించిన అన్ని కేసులను సుప్రీంకు బదిలీ చేయాలని సూచించింది. సీబీఎఫ్​సీ అనుమతి పొందిన సినిమాలను చట్టప్రకారం ప్రతీ రాష్ట్రంలో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది. గతంలో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహించిన కన్నడిగులు కమల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై కర్ణాటక హైకోర్టులో విచారణలు జరగ్గా కమల్‌ క్షమాపణ చెప్పాలని ధర్మాసనం స్పష్టంచేసింది. దీంతో చిత్రబృందం సుప్రీంను ఆశ్రయించింది.

తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కన్నడ భాష పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని కమల్ హాసన్ చెబుతున్నప్పటికీ, క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఈ కేసును కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసుకుంది. "రాష్ట్రాన్ని అల్లరి మూకలు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారి నియంత్రణలోకి వెళ్లనివ్వలేం" అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గత విచారణలో వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.

Next Story