రేపు థియేటర్లలో రిలీజ్‌ అయ్యే సినిమాలు ఇవే

ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాయన్'. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

By అంజి  Published on  25 July 2024 11:00 AM IST
movies, Tollywood, Raayan, Operation Ravan, Purushottamudu

రేపు థియేటర్లలో రిలీజ్‌ అయ్యే సినిమాలు ఇవే

రాయన్‌

ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాయన్'. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమాలో దుషారా విజయన్‌, సందీప్‌ కిషన్‌, కాళిదాస్‌ జయరామ్‌, అపర్ణ బాల మురళి కీలక పాత్రలు పోషించారు. 'బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు.. దహనం చేస్తాడు' అంటూ రిలీజైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. నార్త్ మద్రాస్‌ బ్యాక్ డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. కాగా ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆపరేషన్‌ రావణ్

రక్షిత్‌ అట్లూరి కథనాయకుడిగా వెంకట సత్య దర్శకత్వంలో రూపొందించిన సినిమా 'ఆపరేషన్‌ రావణ్‌'. ఇందులో సంకీర్తన విపిన్‌ హీరోయిన్‌గా నటించింది. కాగా ఆపరేషన్ రావణ్ సినిమాలో మాస్క్ మ్యాన్ సైకో క్యారెక్టర్ కీలకంగా ఉండనుందట. రాధికా శరత్‌ కుమార్‌, చరణ్‌ రాజ్‌, కాంచి, రాకెట్‌ రాఘవ, రఘు కుంచె, కేఏ పాల్‌ రాము, విద్యా సాగర్‌, టీవీ5 మూర్తి, కార్తీక్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది.

పురుషోత్తముడు

రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన సినిమా 'పురుషోత్తముడు'. రమేష్‌ తేజావత్‌, ప్రకాశ్‌ తేజావత్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హాసిని సుధీర్‌ హీరోయిన్‌గా నటించింది. ఒక కోటీశ్వరుడైన అబ్బాయి పల్లెటూరికి ఎందుకు వచ్చాడు అక్కడ ఏం చేశాడనేది "పురుషోత్తముడు" కథ. ప్రకాష్‌ రాజ్‌, మురళి శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముకేష్‌ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ కూడా రేపే విడుదల కానుంది.

Next Story