హీరో మంచు విష్ణు ఆఫీసులో చోరీ.. హెయిర్ స్టైలిస్ట్‌పై కేసు

Theft in Manchu Vishnu office. టాలీవుడ్ హీరో, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

By అంజి  Published on  28 Feb 2022 9:15 AM IST
హీరో మంచు విష్ణు ఆఫీసులో చోరీ.. హెయిర్ స్టైలిస్ట్‌పై కేసు

టాలీవుడ్ హీరో, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిబ్రవరి 17వ తేదీన ఫిల్మ్‌నగర్‌లోని మంచు విష్ణు ఆఫీస్‌లో చోరీ జరిగింది. విలువైన హెయిర్‌ డ్రెస్సింగ్‌, మేకప్‌ సామాగ్రి అపహరణకు గురైంది. వాటి విలువ దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన యు.నాగశ్రీను మంచు విష్ణు దగ్గర హెయిర్‌ స్టైలిస్ట్‌గా పని చేస్తున్నాడు.

ఈ నెల 17న విష్ణు ఆఫీసులోని మేకప్‌ సామాగ్రిని ఎవరి అనుమతి లేకుండా తీసుకెళ్లాడు. ఫోన్‌లో అతడిని కాంటాక్ట్‌ అవుదామన్న.. అందుబాటులోకి రావడం లేదు. ఈ మేరకు చోరీకి పాల్పడినట్లు విష్ణు మేనేజర్‌ సంజయ్‌ ఈ నెల 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంచు విష్ణు హెయిర్‌ స్టైలిస్ట్‌ నాగ శ్రీనే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటాడని, దొంగతనం జరిగినప్పటి నుండి నాగ శ్రీను కనిపించడం లేదని సంజయ్‌ పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story