రామ్‌ 'ది వారియ‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడంటే?

The Warriorr movie telugu pre release event tomorrow. ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ బైలింగ్వల్ మూవీ 'ది వారియర్'.

By అంజి  Published on  9 July 2022 11:40 AM IST
రామ్‌ ది వారియ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడంటే?

ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్ సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో దూసుకుపోతున్న రామ్‌ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్'లో మాస్ యాక్షన్‌తో తన గేరు మార్చాడు. అప్పటి వరకు లవర్‌ బాయ్‌లా కనిపించిన రామ్‌.. ఈ సినిమాతో తనలోని మాస్‌ యాంగిల్‌ను బయటపెడ్డాడు. ఈ మూవీ రామ్‌ కెరీర్‌లోనే భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ తర్వాత కథల ఎంపికలో రామ్‌ ఆచూతూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మాస్‌ ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే భావనతో మాస్ స్టోరీలపై ఫోకస్‌ పెట్టాడు. ఏడాది కిందట వచ్చిన 'రెడ్‌'లో కూడా సిద్దార్థ పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ బైలింగ్వల్ మూవీ 'ది వారియర్'.

అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్ మూవీగా తెరకెక్కిన 'ది వారియర్' మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోషన్ పోస్టర్లు, ట్రైలర్‌ భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు. జూలై 14న ఈ మూవీ రిలీజ్ కానుండటంతో చిత్రయూనిట్ వరుస అప్‌డేట్‌లను ఇస్తోంది. తాజాగా మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను వెల్లడించారు. ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌ రోల్‌లో నటించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిత్తూరి ఈ మూవీని నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇటీవలే చెన్నైలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది.

Next Story