'గామి' ట్రైలర్ వచ్చేస్తోంది

కొత్తదనంతో సినిమాలు తీస్తే తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా కొత్తదనంతో ఉన్న సినిమాలు తీయడంలో హీరో విష్వక్ సేన్‌ ఎప్పుడూ ముందు ఉంటాడు.

By అంజి  Published on  26 Feb 2024 12:15 PM IST
Vishwaksen, Gami, trailer release, Tollywood

'గామి' ట్రైలర్ వచ్చేస్తోంది 

కొత్తదనంతో సినిమాలు తీస్తే తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా కొత్తదనంతో ఉన్న సినిమాలు తీయడంలో హీరో విష్వక్ సేన్‌ ఎప్పుడూ ముందు ఉంటాడు. అతడు ‘గామి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ‘గామి’ మూవీ టీమ్ నుంచి కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఫిబ్రవరి 29న సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. పీసీఎక్స్ ఫార్మాట్‌లో విడుదల కాబోతున్న తొలి ట్రైలర్‌గా గామి ట్రైలర్ నిలవనుందని ‘ఎక్స్’ వేదికగా యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ప్రసాద్ ఐమ్యాక్స్ పీసీఎక్స్ స్క్రీన్‌పై ట్రైలర్ విడుదల కానుంది. సరికొత్త అనూభూతి పొందడానికి సిద్ధంగా ఉండాలని ఫ్యాన్స్‌కు అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

విష్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించిన ‘గామి’ సినిమాకి విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వ‌హించాడు. కార్తీక్‌ శబరీష్‌ నిర్మాత‌గా వ్యవహరించారు. గామి అనేది ఒక వ్యక్తి తన భయాన్ని జయించటానికి చేసిన అసాధ్యమైన ప్రయాణం. టీజర్, పాటలు సినిమా కోర్ థీమ్‌ను తెలియజేయగా.. ట్రైలర్ కథానాయకుడి అద్భుతమైన ప్రయాణాన్ని చూపించనుంది. ట్రైలర్ పోస్టర్‌లో విశ్వక్ సేన్‌తో పాటు అఘోరాలు తమ చేతుల్లో కాగడాలు పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ సినిమాకు జనాల నుంచి కూడా నిధులు సమకూరాయి.

Next Story