'టాక్సిక్' టీజర్ వచ్చేసింది.. యశ్ విశ్వరూపం చూపించాడుగా!
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి 'KGF' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న తదుపరి చిత్రం...
By - అంజి |
'టాక్సిక్' టీజర్ వచ్చేసింది.. యశ్ విశ్వరూపం చూపించాడుగా!
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి 'KGF' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న తదుపరి చిత్రం 'టాక్సిక్'. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న విడుదల కానుంది. 'KGF 2' తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న యష్, తన తదుపరి ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టాలెక్కించారు.
తాజాగా విడుదలైన టాక్సిక్ టీజర్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద మరోసారి యష్ విధ్వంసం ఖాయమనిపిస్తోంది. ఈ సినిమాలో యష్ మునుపెన్నడూ చూడని సరికొత్త 'మాస్' లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన కళ్ళలో ఉన్న తీవ్రత, సిగార్ తాగుతూ ఇచ్చే ఎంట్రీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. టీజర్‌లో వయోలెన్స్ సీన్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని ఒక పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మలిచినట్లు స్పష్టమవుతోంది. టీజర్‌కు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
అది సినిమాలోని ఇంటెన్సిటీని రెట్టింపు చేస్తోంది. ఈ సినిమాలో కేవలం యష్ మాత్రమే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీమణులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా ఈ సినిమాతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. హుమా ఖురేషి, తారా సుతారియా మరియు 'సప్త సాగరదాచె ఎల్లో' ఫేమ్ రుక్మిణీ వసంత్ ఈ భారీ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నారు.