'ప్రభాస్ - మారుతి' సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ !

The second schedule of the movie 'Prabhas - Maruti' has started. ప్రభాస్ - మారుతి కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా (వర్కింగ్ టైటిల్ రాజా డీలక్స్) నుంచి బిగ్

By Sumanth Varma k  Published on  8 Dec 2022 6:05 PM IST
ప్రభాస్ - మారుతి  సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ !

ప్రభాస్ - మారుతి కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా (వర్కింగ్ టైటిల్ రాజా డీలక్స్) నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ ఈ రోజు స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా నటించనున్నారు. ఇక మూడో హీరోయిన్ గా అనుష్క శెట్టి పేరు వినిపిస్తోంది. ఈ సినిమా జోనర్ విషయానికి వస్తే.. ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని.. సబ్జెక్ట్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.

మొత్తమ్మీద మారుతి, ఈ సినిమా కోసం అద్భుతమైన కామెడీ ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. సినిమాలో ఆ రేంజ్ లో ఫన్ ఉంటుందట. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ కి తాతయ్య పాత్రను పోషించబోతున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తీస్తున్న ఈ సినిమాకి అన్నట్టు ప్రభాస్ సైన్ చేసేముందు దర్శకుడు మారుతి కి ఒక కండీషన్ పెట్టాడు. ఈ సినిమాని మూడు నెలల్లో ఫినిష్ చేయాలనేది ఆ కండిషన్. ఎలాగూ మారుతి స్పీడ్ గా సినిమాని పూర్తి చేస్తాడు. ఏమి చేసినా మారుతి బిజినెస్ పరంగా కూడా మంచి లాభాలు వచ్చే విధంగా చేస్తాడు. కాబట్టి.. నిర్మాతలకు ఈ సినిమాతో లాభాలు వచ్చే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి.

Next Story