'భగవంత్ కేసరి' టీజర్ కు ముహూర్తం ఖరారు

బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కతోంది. ఎన్‌బీకే 108వ సినిమాకు 'భగవంత్ కేసరి' అనే టైటిట్‌ను

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Jun 2023 8:15 PM IST
Bhagwant Kesari, Tollywood, Balakrishna, Anil Ravipudi

'భగవంత్ కేసరి' టీజర్ కు ముహూర్తం ఖరారు 

బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కతోంది. ఎన్‌బీకే 108వ సినిమాకు 'భగవంత్ కేసరి' అనే టైటిట్‌ను చిత్రయూనిట్‌ ఖరారు చేసింది. ఐ డోంట్‌ కేర్‌ అనే ట్యాగ్‌ లైన్‌ కూడా ఉంది. టైటిల్‌తో పాటు బాలయ్య లుక్‌ను కూడా రిలీజ్‌ చేస్తూ చిత్ర యూనిట్‌ ట్వీట్‌ చేసింది. అన్న దిగిండు.. ఇక మాస్‌ ఊచకోత షురూ అంటూ ట్వీట్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు.

తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీలీల బాలయ్య కూతురుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నారు. ఆ రోజు హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్‌లో ఉదయం 10:11 గంటలకు బాలయ్య ముహూర్తం పెట్టారు. ఫ్యాన్స్ చేతుల మీదుగా భగవంత్ కేసరి టీజర్ విడుదల కానుంది. దసరాకు ఈ సినిమా విడుదల కానుంది. బాలకృష్ణను అభిమానులు చూడని విధంగా ఈ మూవీలో ప్రజెంట్ చేయబోతున్నట్లు గతంలోనే అనిల్ రావిపూడి చెప్పాడు. ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడతారని ఇప్పటికే ప్రకటించారు. వెండితెరపై బాలయ్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగులకు థియేటర్లు మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story