ఓటీటీలోకి రాజాసాబ్

ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ నెలలోపే స్ట్రీమింగ్‌లోకి రానుంది.

By -  Medi Samrat
Published on : 30 Jan 2026 3:35 PM IST

ఓటీటీలోకి రాజాసాబ్

ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ నెలలోపే స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ప్రభాస్ నుంచి వచ్చిన కమర్షియల్ మూవీ ఇది. హారర్ ఫాంటసీ కథతో దర్శకుడు మారుతి ఈ సినిమా తీశాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లు. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.

Next Story