ముందుగానే రిలీజ్ అవుతున్న 'లక్కీ భాస్కర్'

వెంకీ అట్లూరి చిత్రం 'లక్కీ భాస్కర్' సినిమాకు కొత్త రిలీజ్ డేట్ వచ్చింది.

By అంజి  Published on  9 July 2024 8:00 PM IST
movie , Lucky Bhaskar, Tollywood

ముందుగానే రిలీజ్ అవుతున్న 'లక్కీ భాస్కర్' 

వెంకీ అట్లూరి చిత్రం 'లక్కీ భాస్కర్' సినిమాకు కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. ఎన్నో సినిమాల విడుదలలు ఆలస్యం అవుతూ ఉండగా.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికంటే ముందుగానే విడుదల కాబోతోంది. ఈ సినిమా గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ విషయాన్ని దుల్కర్ సల్మాన్ తన సోషల్ మీడియాలో #LuckyBaskharOnSept7th అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రకటించారు.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న, సుజీత్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న 'దే కాల్ హిమ్ OG'తో పాటు విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, 'లక్కీ భాస్కర్' నిర్మాతలు ఆ సినిమా విడుదల తేదీని కాస్త ముందుకు తీసుకుని వచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్‌మెంట్‌ల కారణంగా ఓజీ ఇంకా పూర్తి కాలేదు. ఏప్రిల్‌లో లక్కీ బాస్కర్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. బ్యాంక్‌లో విసుగు చెందిన బ్యాంకర్‌గా దుల్కర్ కనిపించాడు. ఆ తర్వాత అతడి దగ్గరకు భారీగా డబ్బు ఎలా చేరిందన్నది సినిమా కథ. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Next Story