'విరూపాక్ష' దర్శకుడికి ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన మేకర్స్

యంగ్ డైరెక్టర్ కార్తీక్‌ వర్మ దండు ఇటీవల తీసిన ‘విరూపాక్ష’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

By అంజి  Published on  28 Jun 2023 11:22 AM IST
Virupaksha,  car gift, director Karthik Varma, Tollywood, Sai Tej

'విరూపాక్ష' దర్శకుడికి ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన మేకర్స్

యంగ్ డైరెక్టర్ కార్తీక్‌ వర్మ దండు ఇటీవల తీసిన ‘విరూపాక్ష’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించారు. బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే చేశారు. విడుదలైన రోజు సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ.. భారీ విజయాన్ని అందుకుని, రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. చేతబడి కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన ఈ సినిమా మేకర్స్కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ .. హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో కలిసి దర్శకుడు కార్తీక్‌కి ఒక మెర్సిడెజ్ బెంజ్ కారును సుకుమార్ సమక్షంలో బహుమతిగా అందజేశారు.

వాళ్లకి థ్యాంక్స్ చెబుతూ, అందుకు సంబంధించిన ఫొటోలను కార్తీక్ వర్మ దండు ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘నా జీవితంలో మరిచిపోలేని గిప్ట్ ఇది’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. ప్రమాదం నుంచి కోలుకున్న సాయితేజ్ కి, ఈ సినిమా తనపై తనకి మళ్లీ నమ్మకాన్ని కలిగించింది. అందుకేనేమో దర్శకుడికి ఈ బహుమతిని అందజేసే విషయంలో ఆయన కూడా ఉత్సాహాన్ని చూపించాడు. కార్తీక్‌ వర్మకు గిఫ్ట్‌గా ఇచ్చిన బెంజ్ సీ క్లాస్ మోడల్ ఉన్న ఈ కారు రూ.60 నుంచి 80 లక్షల వరకు ఉంటుంది. ఒక గ్రామీణ నేపథ్యంలో .. ఎక్కువగా చిన్న ఆర్టిస్టులతో కూడిన సెటప్‌తో ఆసక్తికరంగా గా కథను నడిపించిన తీరే ఈ సినిమాకి ఎక్కువ లాభాలు రావడానికి కారణమైందంటే అతిశయోక్తి కాదు.

Next Story