'ది కేరళ స్టోరీ' సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించిన సీఎం

The Kerala Story declared tax-free in Madhya Pradesh. అదా శర్మ నటించిన 'ది కేరళ స్టోరీ' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.

By Medi Samrat  Published on  6 May 2023 6:30 PM IST
ది కేరళ స్టోరీ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించిన సీఎం

అదా శర్మ నటించిన 'ది కేరళ స్టోరీ' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. అలాగే వివాదాలకు కూడా కొదవ లేకుండా పోయింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక వివాదాల మధ్య మే 5న థియేటర్లలో విడుదలైంది. మధ్యప్రదేశ్‌లో కేరళ స్టోరీ సినిమాకి పన్ను మినహాయింపు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి), పలు హిందూ సంస్థలు ఈ సినిమాకు మద్దతు ప్రకటించాయి. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కేరళ స్టోరీ సినిమాకి పన్ను మినహాయింపు ఇవ్వాలని హిందూ సంఘాలు కోరాయి. మే 6న ముఖ్యమంత్రి ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నిజంగానే ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఉందని మధ్యప్రదేశ్ సీఎం వెల్లడించారు.

ఎన్నో వివాదాలు చుట్టూముట్టిన కేరళ స్టోరీ ఎట్టకేలకు మే 5న విడుదలైంది. దీనికి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి. కొందరు దీనిని తీవ్రంగా విమర్శిస్తూ ఉండగా.. మరో వర్గం ఈ సినిమాను 'అద్భుతమైనది' అని చెబుతూ ఉన్నారు. కేరళ స్టోరీకి రాష్ట్రంలో పన్ను మినహాయింపు ఇవ్వాలని బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి రాహుల్ కొఠారీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు గతంలో లేఖ రాసినట్లు సమాచారం. మే 6న శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. "ది కేరళ స్టోరీ సినిమా ఉగ్రవాదం వెనుక ఉన్న భయంకరమైన నిజాలను బట్టబయలు చేసిన చిత్రం. మధ్యప్రదేశ్ లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం" అని ఆయన ట్వీట్ చేశారు.


Next Story