హీరోయిన్‌ని అక్కడ తాకే ప్రయత్నం.. అభిమాని చెంప చెళ్లుమంది.. వీడియో వైరల్
The heroine who was harassed by the fan in Kerala. హీరోయిన్ చుట్టూ జనం గుమిగూడిన సమయంలో.. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. తనపై కొందరు
By అంజి Published on 28 Sept 2022 4:04 PM ISTప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. మహిళలపై వేధింపులు ఆగడం లేదు. మహిళలపై కొందరు కామాంధులు లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు తెగబడుతూనే ఉన్నారు. సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది లైంగిక వేధింపుల బారిన పడుతున్నారు. సినీ హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్‌లోకి వస్తే.. వారి పట్ల అభిమానులు అసభ్యకరంగా ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ హీరోయిన్ చుట్టూ జనం గుమిగూడిన సమయంలో.. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. తనపై కొందరు లైంగిక దాడికి దిగారని హీరోయిన్ షాకింగ్ పోస్టు చేసింది.
వివరాలు ఇలా ఉన్నాయి. ప్రముఖ మలయాళ హీరో నివీన్ పౌలీ లేటెస్ట్‌గా నటించిన సినిమా 'సాటర్ డే నైట్'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఈ మూవీలో నటించి సానియా అయ్యప్పన్ కేరళలోని కోజీకోడ్‌లో గల ఓ మాల్‌కు వెళ్లారు. మూవీ టీమ్ వస్తోందని తెలుసుకున్న అభిమానులు మాల్‌కు పోటెత్తారు. చిత్రయూనిట్ వచ్చిన తర్వాత కార్యక్రమం ముగించుకుని తిరుగు పయనం అయ్యింది. మాల్‌లో భారీగా జనాలు గుమిగూడటంలో చిత్రయూనిట్ అతి కష్టం మీద బయటపడేందుకు యత్నించింది.
అదే సమయంలో హీరోయిన్ సానియా కూడా అక్కడ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అకస్మాత్తుగా ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను తాకేందుకు ప్రయత్నించడంతో.. నటికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే అతడి చెంప చెళ్లుమనిపించింది. మాల్‌లో తాను లైంగిక దాడిని ఎదుర్కొన్నానని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోజీకోడ్‌లో ప్రమోషన్స్ ముగించుకుని తిరిగి వస్తుంటే.. గుంపులో ఓ వ్యక్తి తనను పట్టుకున్నాడని చెప్పింది. ఎక్కడ పట్టుకున్నాడో చెప్పాలంటేనే అసహ్యంగా ఉందని చెప్పింది. మనచుట్టూ ఉన్నవారు ఎందుకు ఇలా ఉన్నారు? అనేది అర్థంకావట్లేదని అంది. తాను ప్రమోషన్‌లో భాగంగా అనేక ప్రదేశాలకు వెళ్లానని, కానీ ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పింది.
Saniya iyappan slapping a guy who tried to touch her body at Calicut hilit mall. pic.twitter.com/73BkbLEOxn
— Basil (@BabzCFC) September 27, 2022
#SaturdayNight promotion event scenes. From Calicut Hilite Mall😯 pic.twitter.com/Zt16hPRTau
— ForumKeralam (@Forumkeralam2) September 27, 2022