మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మన శంకరవర ప్రసాద్’ నుంచి చిత్ర బృందం మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘మీసాల పిల్ల’ సంగీత ప్రియులను అలరిస్తుండగా, తాజాగా రెండో పాట విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
‘శశిరేఖ’ పేరుతో రానున్న ఈ రెండో పాటను డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. డిసెంబర్ 6న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను అభిమానుల డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ పరంగా మీసాల పిల్ల పాట మంచి పేరును తెచ్చుకోగా బాస్ డ్రెస్సింగ్ మీద విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో మెగాస్టార్‌తో పాటు విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.