తెలుగు ఇండియన్ ఐడల్ రెండవ సీజన్ వచ్చేస్తుంది..!
Thaman, Geetha Madhuri and Karthik to judge Telugu Indian Idol 2. ఆహాలో ప్రసారం అయిన తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ ప్రేక్షకుల నుండి
By M.S.R Published on 15 Feb 2023 5:57 PM ISTఆహాలో ప్రసారం అయిన తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. మ్యూజిక్ రియాలిటీ షో రెండవ సీజన్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ సీజన్‌లో స్వరకర్త ఎస్ఎస్ థమన్, గాయకులు గీతా మాధురి, కార్తీక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. స్ట్రీమింగ్ తేదీ, పోటీదారుల జాబితాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
ఎవరి పేరు చెప్తే స్పీకర్లు వూఫర్లు గడ గడా వణుకుతాయో, ఆయనే మన మొదటి జడ్జ్!
— ahavideoin (@ahavideoIN) February 12, 2023
Presenting Thaman, our first judge for Telugu Indian Idol season 2. Coming soon.#teluguindianidol2 @MusicThaman @southindiamalls @realmeIndia @KhiladiOfficia3 @BingoSnacks @ShaadiDotCom pic.twitter.com/JgC4xrtSMA
ఇండియన్ ఐడల్‌కి దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షో తెలుగు వెర్షన్ మొదటి సీజన్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం రెండో సీజన్ జరుగుతోంది. ప్రారంభ ఎపిసోడ్ కోసం థమన్ కు సంబంధించిన ప్రోమోను ఇటీవలే చిత్రీకరించారు. థమన్.. గీతా మాధురి, కార్తీక్‌లతో కలిసి షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తారు. థమన్ మాట్లాడుతూ.. "తెలుగు ఇండియన్ ఐడల్ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే నేను మొదటి సీజన్ లో ఎంతో ఎంజాయ్ చేశాను. షో రెండవ సీజన్ ప్రారంభించబోతున్నందుకు ఎదురుచూస్తూ ఉన్నాను." అని అన్నాడు.
కమర్షియల్ సినిమా అయినా, లవ్ స్టోరీ అయినా, మాస్ బీట్ అయినా మెలోడీ అయినా, తన పాటలకి కనెక్ట్ అవ్వని వారుండరు
— ahavideoin (@ahavideoIN) February 14, 2023
Presenting @geethasinger - Our 3rd Judge for Telugu Indian Idol S2. Coming Soon.@MusicThaman@singer_karthik@southindiamalls @realmeIndia @KhiladiOfficia3 @BingoSnacks pic.twitter.com/mJXcUcmP6g
ఎన్నో పాటలకి ప్రాణం పోసి మన హార్ట్స్ లో ఎప్పటికీ నిలిచిపోయే మెలోడీస్ ని మాస్ నంబర్స్ ని మనకి అందించిన కార్తీక్, మన సెకండ్ జడ్జ్.
— ahavideoin (@ahavideoIN) February 13, 2023
Presenting Karthik, our second judge for Telugu Indian Idol season 2. Coming soon.#teluguindianidol2 @MusicThaman @singer_karthik pic.twitter.com/skW70jhizV