కొనసాగుతున్న ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలు.. సాయంత్రమే రిజల్ట్స్‌

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి.

By అంజి  Published on  30 July 2023 4:18 AM GMT
Tfcc Elections, Dil Raju, C Kalyan, Tollywood

కొనసాగుతున్న ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలు.. సాయంత్రమే రిజల్ట్స్‌

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. అనంతరం కౌంటింగ్ మొదలుపెట్టి సాయంత్రం 6 గంటలకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. మరి ఈ ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారో, తెలుగు ఫిలిం ఛాంబర్ ఏ ప్యానల్ చేతుల్లోకి వెళ్తుందో మరికొన్ని గంటల్లో తేలుతుంది.

నటుడు పోసాని కృష్ణమురళి, నిర్మాత సుప్రియ, గుణశేఖర్‌ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు మొత్తం 104 ఓట్లు పోలైయ్యాయి. ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్.. ఇలా దాదాపు మొత్తం సభ్యులు 3000 మంది సభ్యులు ఉన్నారు. నిర్మాతలే దాదాపు 1600 మంది ఉన్నారు. ఈ రోజు దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది.

నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్‌లో నాలుగు సెక్టార్స్‌ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న సభ్యులు తన ప్యానెల్లో ఉన్నారని తెలిపారు. ఎన్నికల్లో 4 విభాగాల సభ్యులు పాల్గొంటారని, ఆ నాలుగు విభాగాల్లో సమస్యలున్నాయని తెలిపారు. ముఖ్యంగా నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్‌కు సమస్యలు ఎక్కువ. వాటిని పరిష్కరించేందుకు కొన్ని కొత్త ఐడియాలతో తమ ప్యానెల్‌ ముందుకు వస్తోందన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని మేమందరం ఐక్యతతో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. సభ్యులు మొత్తం 1500 మంది ఉన్నారని, కానీ యాక్టివ్‌గా ఉంది మాత్రం 150 మందేనని అన్నారు. ఈ మూడు సంవత్సరాలలో సినిమా తీసిన వాళ్ళు మాత్రమే ఈ సీట్లలో కూర్చోవాలని చెప్పామని, కానీ దానికి వాళ్ళు ఒప్పుకోలేదన్నారు. ఇక్కడ సక్సెస్ లేకపోతే వెనకపడిపోతామన్నారు. అందుకనే తాము గిల్డ్ పెట్టామని, తమకు ఉన్న సమస్య చాంబర్ బైలా లో మార్పులు జరగాలి అని దిల్‌ రాజు పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాగుండాలి అంటే దిల్ రాజు కావాలా వద్దా అని ఆలోచించుకోవాలని దిల్ రాజు అన్నారు.

Next Story