తెలుగు బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సక్సెస్‌ఫుల్ షోగా తెలుగు బిగ్‌బాస్ షో పేరు తెచ్చుకుంది. గత 5 సీజన్ల నుండి ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్‌బాస్ షోకు.. రేటింగ్ కూడా అత్యధికంగా దక్కుతోంది. ఫిబ్రవరి 26న ఈ బిగ్ బాస్ షో.. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ అంటూ కొత్త వెర్షన్‌తో లైవ్ స్ట్రీమింగ్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. 84 రోజుల పాటు ఈ షో కొనసాగనుంది. 17 మంది కంటెస్టెంట్లతో ప్రసారమవుతున్న ఈ షోలో గతంలో ఎప్పుడూ చూడని రచ్చ కొనసాగుతోంది. కొత్తవాళ్లను, పాత వాళ్లను గ్రూప్‌లుగా విడదీసి, వారి మధ్య ఆసక్తికరమైన టాస్కులు పెడుతున్నారు. బోల్డ్ టాస్కులతో పాటు లైవ్ స్ట్రీమింగ్ కావడంతో బీప్‌లు, కట్‌లు ఉండటం లేదు. దీంతో ఈ షో ప్రారంభంలోనే హైలెట్‌గా నిలిచింది.
ఓటీటీ ప్లాట్‌పామ్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోను రోజుకు 2 ఎపిసోడ్స్ చొప్పున విడుదల చేస్తున్నారు. అయితే లైవ్ స్ట్రీమింగ్ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుండటంతో ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే షోను మొత్తానికే ఆపేస్తూ ప్రేక్షకులకు నిరాశ కలిగించారు మేకర్స్. బుధవారం అర్థరాత్రి నుండి బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్న సోషల్ మీడియా ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలిపింది. అయితే ఉన్నఫలంగా షో ఆగిపోవడంపై ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. సడన్‌గా షోను ఆపడానికి గల కారణాలు వెల్లడించలేదు. తిరిగి గురువారం అర్థరాత్రి 12 గంటల నుండి షోను రీస్టార్ట్ చేస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చారు.