ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోబోతున్న యాంకర్‌ నేహా చౌదరి

Telugu Anchor Neha chowdary getting married soon. బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ నేహా చౌదరి త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. తనతో కలిసి బీటెక్‌

By అంజి  Published on  21 Nov 2022 12:56 PM IST
ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోబోతున్న యాంకర్‌ నేహా చౌదరి

బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ నేహా చౌదరి త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. తనతో కలిసి బీటెక్‌ చదివిన తన క్లాస్ మేట్, 13 ఏళ్ల నుంచి తనకు స్నేహితుడైన అనిల్‌ను వివాహం చేసుకోనున్నట్లు నేహా చౌదరి వెల్లడించింది. ఇక తనకు కాబోయే భర్త అనిల్ ఆరు అడుగుల ఎత్తు ఉంటాడని చెప్పిన నేహా చౌదరి.. ఆయన ఫొటోను మాత్రం చూపించలేదు. 'నా పెళ్లి గోల మొదలైంది' అంటూ తన బ్లాగ్‌లో ఒక వీడియో ద్వారా తనకు కాబోయే భర్త గురించి ఇంటర్‌డ్యూస్‌ చేసింది.

ఇక బుల్లితెర యాంకర్‌ నేహకు అభిమానులతో పాటు పలువురు శుభాకాంక్షలు చెపుతున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు కూడా.. నాగార్జునతో నేహా తన పెళ్లి గురించి మాట్లాడింది. బిగ్ బాస్ షోకు వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పలు షోలకు యాంకరింగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు నేహా చౌదరి బాగా దగ్గరయింది. తిరుపతికి చెందిన నేహకు క్రీడాకారిణిగా కూడా చాలా గుర్తింపు ఉంది. రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో ఆమె నేషనల్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది.



Next Story