గద్దర్‌ అవార్డుల ప్రకటన.. బెస్ట్‌ యాక్టర్‌గా అల్లు అర్జున్‌

తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ - 2024 అవార్డులను ప్రకటించింది. ఈ జూన్‌ 14వ తేదీన అవార్డులు ప్రదానం చేస్తారు.

By అంజి
Published on : 29 May 2025 11:28 AM IST

Telangana government, Gaddar Awards, Allu Arjun, best actor, Tollywood

గద్దర్‌ అవార్డుల ప్రకటన.. బెస్ట్‌ యాక్టర్‌గా అల్లు అర్జున్‌

తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ - 2024 అవార్డులను ప్రకటించింది. ఈ జూన్‌ 14వ తేదీన అవార్డులు ప్రదానం చేస్తారు. బెస్ట్‌ యాక్టర్‌గా అల్లు అర్జున్‌ (పుష్ప-2), బెస్ట్‌ ఫిల్మ్‌గా 'కల్కి' నిలిచినట్టు జ్యూరీ చైర్మన్‌ జయసుధ తెలిపారు. ఉత్తమ రెండు, మూడో చిత్రాలుగా పొట్టేల్‌, లక్కీభాస్కర్‌ నిలిచాయి. ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజుతో కలిసి జయసుధ మీడియా సమావేశం నిర్వహించారు. గద్దర్‌ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా.. వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సినిమా అవార్డులను ప్రదానం చేస్తోంది.

బెస్ట్‌ డైరెక్టర్‌గా నాగ్‌ అశ్విన్‌ (కల్కి)

బెస్ట్‌ యాక్ట్రెస్‌గా నివేదా థామస్‌ (35- చిన్న కథకాదు)

బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ - బీమ్స్‌

బెస్ట్‌ మేల్‌ సింగర్‌ - సిద్‌ శ్రీరామ్‌ (ఊరి పేరు భైరవ కోన)

బెస్ట్‌ ఫీమేల్‌ సింగర్‌ - శ్రేయా ఘోషల్‌ (పుష్ప-2)

బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ - ఎస్‌ జే సూర్య (సరిపోదా శనివారం)

బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌ - శరణ్యా ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)

బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌ డైరెక్టర్‌ - యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)

బెస్ట్‌ ఫీచర్‌ హెరిటేజ్‌ ఫిల్మ్‌ - రజాకార్‌

ఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఆయ్‌.. మేం ఫ్రెండ్స్‌ అండి

స్పెషల్‌ జ్యూరీ అవార్డు - దుల్కర్‌ సల్కాన్‌ (లక్కీ భాస్కర్‌)

స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌ - అనన్య నాగళ్ల (పొట్టేల్‌)

బెస్ట్‌ లిరిసిస్ట్‌ - చంద్రబోస్‌ (రాజు యాదవ్‌)

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ - విశ్వనాథ్‌ రెడ్డి (గామి)

బెస్ట్‌ ఎడిటర్‌ - నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్)

బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌ - గణేష్‌ ఆచార్య (దేవర)



Next Story