మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

Telangana CM KCR phone to Megastar Chiranjeevi.క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ఇండ‌స్ట్రీని వ‌దల‌డం లేదు. ఇప్ప‌టికే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2022 10:03 AM GMT
మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ఇండ‌స్ట్రీని వ‌దల‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ న‌టులు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి కోలుకోగా.. నిన్న‌ మెగాస్టార్ చిరంజీవి రెండో సారి క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం తెలిసిన అభిమానులు, శ్రేయాభిలాషులు, రాజ‌కీయ‌నాయ‌కులు ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. చిరు ఆరోగ్యం గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. చిరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని చిరంజీవి నిన్న (జ‌న‌వ‌రి 26న‌) సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం వైద్యుల సూచ‌న‌ల‌తో హోం క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. త‌న‌ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. త్వ‌ర‌లోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వ‌స్తాన‌ని ట్వీట్ చేశారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం చిరు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇందులో 'ఆచార్య' చిత్రం విడుద‌ల‌కు సిద్దంగా ఉండ‌గా.. 'గాడ్‌ఫాదర్', 'భోళా శంకర్' సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శలో ఉన్నాయి.

Next Story
Share it