రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన హీరోయిన్‌.. అయినా అలాగే అమ్మ‌వారి ద‌ర్శనానికి

Tanushree Dutta meets with an accident while on way to Ujjain temple.ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ త‌ను శ్రీ ద‌త్తా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2022 6:03 AM GMT
రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన హీరోయిన్‌.. అయినా అలాగే అమ్మ‌వారి ద‌ర్శనానికి

ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ త‌ను శ్రీ ద‌త్తా ప్ర‌యాణీస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. మంగ‌ళ‌వారం ఆమె ఉజ్జ‌యినిలోని మ‌హంకాళి అమ్మవారి ద‌ర్శ‌నం కోసం కారులో వెలుతుండ‌గా.. ఆమె ప్ర‌యాణిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్ కావ‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో కారు డ్యామేజ్ కాగా.. త‌నుశ్రీ కాలికి గాయాలు అయ్యాయి. వెంట‌నే ఆమెను ద‌గ్గ‌రిలోని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. కాలి గాయానికి కుట్లు వేసి చికిత్స అందించారు. అనంత‌రం ఆమె అలాగే అమ్మ‌వారిని ద‌ర్శించుకుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌నుశ్రీ ద‌త్తా వెల్ల‌డించింది.

'ఈ రోజు నా జీవితంలో చాలా సాహసవంతమైన రోజు. గుడికి వెళ్తుండగా నా కార్ బ్రేకులు ఫెయిల్ అయి రోడ్డు ప్రమాదం జరిగింది. కాలికి కొన్ని కుట్లు వేశారు. ఎలాగైతేనేం దర్శనం చేసుకున్నాను. జై మహాకాళ్‌' అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్ర‌స్తుతం త‌ను శ్రీ గాయానికి సంబంధించిన పోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.


Next Story
Share it