ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన త‌నీష్

Tanish attends ED Investigation.టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ కొనసాగుతుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sep 2021 6:38 AM GMT
ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన త‌నీష్

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ, న‌వ‌దీప్, ముమైత్ ఖాన్‌ లను విచారించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా.. నేడు న‌టుడు త‌నీష్ ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్‌ ఉల్లంఘనపై తనీష్‌ను ఈడీ ప్రశ్నించనుంది. కెల్విన్‌తోఉన్న సంబంధాల‌పై కూడా ఆరాతీయ‌నుంది.

ఎఫ్ క్ల‌బ్‌లో జ‌రిగే పార్టీల‌కు ఎప్పుడైనా హాజ‌ర‌య్యారా..? ఎఫ్ క్ల‌బ్‌లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తారా..? డ్ర‌గ్స్ వినియోగించే సెల‌బ్రెటీలు ఎవ‌రైనా తెలుసా..? అంటూ త‌నిష్‌పై అధికారులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌నున్నారు. ఇప్పటికే తనీష్‌కు నోటీసులు జారీ చేసిన ఈడీ బ్యాంకు ఖాతాలను వెంట తేవాలని పేర్కొంది. కాగా.. ఈడీ నోటిసుల‌పై గురువారం సాయంత్రం మీడియాతో త‌నీష్ మాట్ల‌డుతూ.. కెల్విన్‌తో త‌న‌కు ఎలాంటి ప‌రిచ‌యం లేద‌న్నాడు. ఈడీ విచార‌ణ‌కు పూర్తిగా స‌హక‌రిస్తాన‌ని తెలిపాడు.

Next Story
Share it