'వారసుడు' మూవీ రిలీజ్‌ వాయిదా.. ఎందుకో చెప్పిన దిల్‌రాజ్‌

Tamil Hero Vijay Varasudu movie release postponed to jan 14th. కోలీవుడ్‌ టాప్‌ హీరో విజయ్‌ దళపతి నటించిన లేటెస్ట్‌ మూవీ 'వారసుడు'. తాజాగా ఈ మూవీ

By అంజి  Published on  9 Jan 2023 11:29 AM IST
వారసుడు మూవీ రిలీజ్‌ వాయిదా.. ఎందుకో చెప్పిన దిల్‌రాజ్‌

కోలీవుడ్‌ టాప్‌ హీరో విజయ్‌ దళపతి నటించిన లేటెస్ట్‌ మూవీ 'వారసుడు'. తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజ్‌ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు బుకింగ్‌ యాప్స్‌లలో ఈ మూవీ కనిపించకపోయేసరికి అభిమానులు ఆందోళన చెందారు. 'వాల్తేరు వీరయ్య', 'వీర నరసింహారెడ్డి' సినిమాలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

జనవరి 14న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమా రిలీజ్‌పై సందిగ్ధత వీడిపోయింది. వారసుడు సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. తమిళంలో ఈ సినిమా జనవరి 11నే రిలీజ్ కానుంది. టాలీవుడ్‌ ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడిన తర్వాతే ఈ సినిమాను రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు దిల్‌రాజ్‌ తెలిపారు. వారసుడు మూవీ దిల్‌రాజ్‌ బ్రాండ్‌ తరహాలో ఉంటుందని, ఫ్యామిలీ ఎంటర్టైనరే అయినా ఓ కొత్త పాయింట్‌ ఉంటుందన్నారు.

వారసుడు సినిమాలో విజయ్‌ సరసన రష్మిక నటించింది. శ్రీకాంత్‌, శరత్ కుమార్‌, కిక్‌ శ్యామ్‌, సంగీత, జయసుధ, ఖుష్బూ కీ రోల్స్‌లో నటించారు.

Next Story