ఇటీవల సినీపరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మరణాన్ని జీర్ణించుకోలేకముందే మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రముఖ దర్శకుడు త్యాగరాజన్ కన్నుమూశారు. చెన్నైలోని ఏవీఎం స్టూడియో అపోజిట్ స్ట్రీట్‌లో బుధవారం ఉదయం ఆయన నిర్జీవంగా కనిపించడంతో.. సినీ పరిశ్రమకు చెందిన వారు షాక్‌కు గురైయ్యారు.
1991లో ఏవీఎం ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రభు కథానాయకుడిగా వెట్రిమేల్ వెట్రి, విజయకాంత్ హీరోగా మా నగర కావలన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. అవకాశాలు తగ్గడంతో సొంతూరు అరుంబుకోటైకి వెళ్లిపోయారు. అక్కడ జీవిస్తున్న క్రమంలో ఇటీవల ప్రమాదానికి గురైయ్యారు. దీంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. చికిత్స అనంతరం కోలుకున్న తరువాత తిరిగి చెన్నైకి తిరిగి వచ్చారు.
స్థానిక వడప ళణి, ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కనే పడుకుని అమ్మా క్యాంటీన్‌లో తింటూ దీన పరిస్థితి అనుభవించారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. పోలీసులు అనాథ శవంగా భావించి మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దర్శకుడిగా ఓ వెలుగువెగిలిన ఆయన.. అనారోగ్యం, పేదరికం కారణంగా అదే స్టూడియో పరిసరాల్లో చనిపోవడం చనిపోవడం కంటతడిపెట్టిస్తోంది.