మరో తమిళ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మూవీ ఖరారు..ఇదిగో గ్లింప్స్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో తమిళ డైరెక్టర్ కనగరాజ్ కాంబోలో నటించబోతున్నారు.

By -  Knakam Karthik
Published on : 14 Jan 2026 7:07 PM IST

Cinema News, Tollywood, Enteratinment, Allu Arjun, Lokesh Kanagaraj, Mythri Movie Makers, Anirudh Ravichander

మరో తమిళ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మూవీ ఖరారు..ఇదిగో గ్లింప్స్

పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి రికార్డులు క్రియేట్ చేసిన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో తమిళ డైరెక్టర్ కనగరాజ్ కాంబోలో నటించబోతున్నారు. కాగా ఈ కాంబోలో సినిమాను కన్ఫార్మ్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ అధికారికంగా ప్రకటించింది. ఎప్పటినుంచో ఊహాగానాల రూపంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు బుధవారం భోగి పండుగ సందర్భంగా ప్రకటించారు. AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. కథ ఇప్పటికే ఖరారైందని, స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని తెలుస్తోంది.

ఇప్పటికే అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్ కథానాయికలు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక బన్నీ కొంత విరామం తీసుకుని లోకేశ్ కనగరాజ్ సినిమా సెట్స్‌లో అడుగుపెడతారు.

Next Story