రైజా విల్సన్.. 'ప్యార్..ప్రేమ.. కాదల్' సినిమా ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక హీరోయిన్ అయ్యాక అప్పుడప్పుడు ఫేషియల్ వంటివి చాలా సహజమే..! తాజాగా రైజా విల్సన్ అలా వెళ్ళినప్పుడు ఓ డెర్మటాలజిస్ట్ ఆమెకు అనవసరమైన ట్రీట్మెంట్ ను ఇచ్చి ఆమె ముఖం ఓ వైపు ఉబ్బేలా చేసింది. దీంతో రైజా తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. తనకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ను కలవడానికి వెళ్లగా.. ఆమె అక్కడ లేదని చెబుతున్నారట.. తనలాగా మోసపోకండి అని రైజా విల్సన్ చెబుతూ ఉంది.
రైజా విల్సన్ తనకు వద్దు అని చెబుతున్నా కూడా డాక్టర్ భైరవి సెంథిల్ వినకుండా చర్మానికి మరింత నిగారింపు తీసుకొస్తానంటూ ఆమెకు చర్మ చికిత్స చేసింది. దీంతో అది వికటించి నటి కన్ను కింద వాచిపోయింది. అది ఉబ్బిపోయి కనిపించింది. దీంతో రైజా సోషల్ మీడియాలో తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసింది. "నాకు అవసరం లేకపోయినా డాక్టర్ భైరవి సెంథిల్ నాకేదో ట్రై చేసింది. చివరికి ఫలితం ఇలా వచ్చింది.. దీని గురించి అడగాలని వెళ్తే ఆమె నాతో మాట్లాడటానికి, కలవడానికి కూడా నిరాకరిస్తోంది. సిబ్బందిని అడిగితే ఆమె అసలు నగరంలోనే లేదని జవాబిస్తున్నారు" అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో యాడ్ చేసింది. అందులో ఆమె ఫేస్ లో వచ్చిన మార్పులను గమనించవచ్చు.