రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ప్రముఖ నటి తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మ విడిపోయారు. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. "ఇద్దరూ విడిపోయారు. ఇది సెలబ్రెట్ చేసుకునే విషయం కాదు కాబట్టి దానిని తక్కువగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు" అని వీరిద్దరి సన్నిహిత వర్గాలు ఓ ప్రముఖ నేషనల్ మీడియాతో తెలిపాయి.
2023లో లస్ట్ స్టోరీస్- 2 విడుదలైన సందర్భంగా తమన్నా, విజయ్ వర్మ ఇద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా వెల్లడించారు. డార్లింగ్స్ నటుడు విజయ్.. తమ బంధాన్ని ఎప్పుడూ దాచుకోకపోయినా, వారి గోప్యతను వారు ఎంతో గౌరవిస్తారని వెల్లడించారు. గతంలో, Mashable India కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తమన్నాతో తన డేటింగ్ పట్ల ప్రజల స్పందన చూసి తాను ఎంత ఆశ్చర్యపోయానో వర్మ గుర్తుచేసుకున్నాడు.
"షాక్ లగా కి ఇట్నా లోగోన్ కో ఇంటరెస్ట్ హై ఇస్మే (నా వ్యక్తిగత జీవితంపై ప్రజల ఆసక్తిని చూసి నేను షాక్ అయ్యాను), కానీ నేను దానికి అలవాటు పడ్డాను. ఇది నా సినిమా విడుదల కంటే పెద్ద వార్త. ప్రజలు విషయాలను ఎలా చూస్తారనే దాని గురించి ఇది ఒక పెద్ద ఆవిష్కరణ" అని నటుడు అన్నారు. విజయ్ వర్మ తన సంబంధం గురించి మాట్లాడుతూ, "లస్ట్ స్టోరీస్ తర్వాత మా సంబంధం మొదలైంది. మొదట, మేము సహ నటులుగా కలిశాము, చాలా ప్రొఫెషనల్, తరువాత నేను ఆమెను డేటింగ్‌కు అడిగాను" అని అన్నారు.