త‌ల‌సాని వ‌ద్ద‌కు చేరిన సినీ కార్మికుల పంచాయ‌తీ.. పంతాలు, ప‌ట్టింపులు వ‌ద్దన్న మంత్రి

Talasani asks Film Chamber to resolve issues of cine workers.తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్‌ కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jun 2022 6:43 AM GMT
త‌ల‌సాని వ‌ద్ద‌కు చేరిన సినీ కార్మికుల పంచాయ‌తీ.. పంతాలు, ప‌ట్టింపులు వ‌ద్దన్న మంత్రి

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్‌ కు మధ్య వివాదం ముదురుతోంది. సినీ కార్మికులు వేత‌నాలు పెంచాలంటూ చేప‌ట్టిన నిర‌స‌న కొన‌సాగుతోంది. ప‌లితంగా 25కు పైగా చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయాయి. ఈ రోజు నుంచి యదావిధిగా షూటింగ్స్ లో పాల్గొనాలి అని తెలుగు పిలిం ఛాంబర్ కోరింది. 15 రోజుల పాటు పాత ప‌ద్ద‌తిలోనే కార్మికుల‌కు వేత‌నాలు చెల్లించాల‌ని నిర్మాత‌ల‌కు సూచించింది. ఒకవేళ షూటింగ్‌లో పాల్గొనకపోతే మేమే ఆరు నెలల పాటు షూటింగ్స్ నిలిపి వేస్తామని నిర్మాత‌లు హెచ్చరించారు. అయితే.. ఎట్టిపరిస్థితుల్లో వేతనాలు పెంచేంత వరకు షూటింగ్ లకు హాజరుకాము అని ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు

ఇక ఈ పంచాయ‌తీ తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వ‌ద్ద‌కు చేరింది. మంత్రిని నిర్మాత‌ల మండ‌లి, ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ నేత‌లు వేర్వేరుగా క‌లిశారు. అనంత‌రం మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌, నిర్మాత సి.క‌ల్యాణ్ లు మాట్లాడారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి వేతనాలు పెంచుతామ‌ని, అయితే.. షూటింగ్స్ ప్రారంభ‌మైతేనే అది సాధ్యం అని నిర్మాత సి.క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఈ రోజు కూడా షూటింగ్స్ నిలిచిపోయాయ‌ని, నిర్మాత‌లంతా ఎవ‌రితో ప‌ని చేయించుకోవాలో వారిలో చేయించుకుంటామ‌ని అన్నారు. అవ‌స‌రం అయితే.. షూటింగ్‌లు ఆప‌డానికి తాము సిద్దంగా ఉన్నామ‌న్నారు.

సమస్య ఇరువైపులా ఉంది. సామరస్యంగా చర్చించుకుని సమస్య పరిష్కరించుకోవాలి. కరోనా కారణంగా వేతనాలు పెంచలేదు. ఇప్పుడు పంతాలకు పోవడం మంచిది కాదు. ఇరుపక్షాలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా కూర్చుని మాట్లాడుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Next Story