హాలీవుడ్ లో అడుగుపెట్టనున్న టబు

టబు.. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన మన హైదరాబాదీ. బాలీవుడ్ లో కూడా స్టార్డమ్ ను సొంతం చేసుకున్న టబు ఇప్పుడు హాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్నారు

By M.S.R  Published on  14 May 2024 8:15 PM IST
హాలీవుడ్ లో అడుగుపెట్టనున్న టబు

టబు.. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన మన హైదరాబాదీ. బాలీవుడ్ లో కూడా స్టార్డమ్ ను సొంతం చేసుకున్న టబు ఇప్పుడు హాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్నారు. అది కూడా భారీ హిట్ సిరీస్ లో టబు భాగమయ్యారు. హాలీవుడ్ సిరీస్ 'డ్యూన్‌: ప్రొఫెసీ' సినిమా కోసం టబు ఎంపికయ్యారు. వెరైటీలోని ఒక నివేదిక ప్రకారం డ్యూన్‌కి ప్రీక్వెల్‌గా తీసే సిరీస్‌లో టబు కనిపిస్తారు. నివేదిక ప్రకారం, సిస్టర్ ఫ్రాన్సిస్కా పాత్రలో టబు ఆకట్టుకోనున్నారు. తెలివైన, ఆకర్షణీయమైన, పవర్ ఫుల్ పాత్రలో ఆమె కనిపించనున్నారు.

ఈ సిరీస్ లో ఎమిలీ వాట్సన్, ఒలివియా విలియమ్స్, ట్రావిస్ ఫిమ్మెల్, జోహ్డి మే, మార్క్ స్ట్రాంగ్, సారా-సోఫీ బౌస్నినా, జోష్ హ్యూస్టన్, క్లో లీ, జాడే అనౌకా, ఫాయోలియన్ కన్నింగ్‌హామ్, ఎడ్వర్డ్ డేవిస్, అయోఫ్ హిండ్స్, క్రిస్మ్‌లిన్ బ్రూన్, షాలోలిన్ బ్రూన్- కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ది డ్యూన్‌ సాగా రెండు పార్ట్లుగా విడుదలై అపారమైన విజయాన్ని సాధించింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా $1.1 బిలియన్లు వసూలు చేసింది. డ్యూన్‌: పార్ట్ టూ ఈ సంవత్సరం మార్చిలో విడుదలైంది, ఇందులో జెండయా, ఆస్టిన్ బట్లర్, తిమోతీ చలమేట్ నటించారు. కృతి సనన్, కరీనా కపూర్‌లతో కలిసి టబు చివరిగా క్రూ సినిమాలో నటించారు.

Next Story