సినీ ఇండస్ట్రీలో మాపై ఇంకా వివక్ష ఉంది: తాప్సీ
Taapsee pannu says that there is discrimination against women in the film industry
By అంజి Published on 31 July 2022 4:25 AM GMTహీరోయిన్ తాప్సీ పన్ను.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించి.. ఇప్పుడు బాలీవుడ్‌లో సెటిలైంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ 12 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ సంచలన కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో మహిళల పట్ల వివక్ష ఉందని కామెంట్ చేసింది. ఈ 12 ఏళ్లలో మహిళల పట్ల ఇండస్ట్రీలో పెద్దగా మార్పు ఏమీ రాలేదంది.
తన కెరీర్ ప్రారంభం నుంచి మహిళలపై వివక్షను చూస్తూనే ఉన్నట్లు చెప్పింది. షూటింగ్ లొకేషన్, అకామిడేషన్, ఇతర సౌకర్యాలు, రెమ్యూనరేషన్, ఇలా ప్రతీ దగ్గర మేల్, ఫీమేల్ అనే తేడాలు చూపిస్తున్నారని చెప్పింది. మళ్లీ ఈ మధ్యలో స్టార్స్‌కు ఒక విధంగా.. కాస్త తక్కువ వాళ్లకు ఒక రకంగా ట్రీట్ ఉంటోందని అంది.
''నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాకు ఇచ్చే కారవాన్‌లు అగ్గిపెట్టెల్లా ఉండేవి. అదే హీరోలకు, పేరున్న నటులకు డబుల్ డోర్ వెహికిల్స్ ఏర్పాటు చేసేవారు. మేకప్, కాస్ట్యూమ్, హెయిర్ స్టైలిస్ట్ ఇలా హెల్పర్స్ విషయంలో కూడా అంతే చిన్న చూపు ఉండేది. హీరోయిన్‌గా ఒక స్టార్ డమ్ వచ్చిన తరువాత పరిస్థితుల్లో మార్పులు వచ్చేవి. అయితే ఎంత మార్పు వచ్చినా.. హీరో కంటే తక్కువగానే మమ్మల్ని చూసేవారు. హీరోలతో పోల్చితే మాకు ఇస్తున్న పారితోషికాల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి'' అని తాప్సీ అన్నారు.
''నేను నిర్మాతగా మారిన తర్వాత ఈ తేడాలు సెట్స్‌లో లేకుండా చూసుకుంటున్నాను. మహిళలకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చుతున్నాను'' అని చెప్పింది. బేబీ, బద్లా, నామ్ షబానా, సాంద్ కీ ఆంఖ్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె నిర్మాతగా మారి ఔట్‌సైడర్స్ ఫిలింస్ అనే సంస్థను కూడా స్థాపించింది. లేటెస్ట్‌గా ఆమె దొబారా, ఏలియన్, వో లడ్కీ హై కహాన్ సినిమాలు చేస్తోంది. వీటితో పాటు షారుఖ్ ఖాన్‌తో 'డంకీ' మూవీలో యాక్ట్ చేస్తున్నారు.