విడాకులపై కొత్తగా చెబుతున్న శ్వేతా బ‌సు ప్ర‌సాద్

Swetha Basu prasad comments on her divorce.శ్వేతా బ‌సు ప్ర‌సాద్.. రోహిత్‌ మిట్టల్‌ అనే బాలీవుడ్‌ దర్శకుడిని పెళ్లి చేసుకుని, ఎనిమిది నెలల్లోనే విడాకులు ఇచ్చేసింది.

By Medi Samrat  Published on  8 Feb 2021 5:27 PM IST
Swetha Basu

శ్వేతా బ‌సు ప్ర‌సాద్.. బాల నటిగానే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమా ద్వారా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెను వివాదాలు చుట్టుముట్టాయి. ఆ తర్వాత రోహిత్‌ మిట్టల్‌ అనే బాలీవుడ్‌ దర్శకుడిని పెళ్లి చేసుకుని, ఎనిమిది నెలల్లోనే విడాకులు ఇచ్చేసింది. ప్ర‌స్తుతం ఆమె ఒంటరిగా ఉంటోంది. తాజా ఇంటర్వ్యూలో త‌న‌ జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించాన‌ని చెప్పింది. త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన త‌ర్వాత స్వేచ్ఛ‌గా జీవిస్తున్నాన‌ని శ్వేతా బ‌సు ప్ర‌సాద్ తెలిపింది. పెళ్లి తర్వాత కూడా స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయ‌ని, ఇప్పుడు మాత్రం స్వేచ్ఛగా జీవిస్తున్నానని శ్వేతా బ‌సు ప్ర‌సాద్ అంటోంది. తన వివాహ జీవితం ఎనిమిది నెలల్లోనే ముగుస్తుందని తాను ఊహించలేదని.. ఇప్పుడు మాత్రం జీవితం మాత్రం హ్యాపీగా ఉంద‌ని తెలిపింది. ఎంతో మంది జంటలు కొన్ని సంవత్సరాల పాటూ హ్యాపీగా బ్రతకడం తాను చూశానని.. కానీ తన వైవాహిక బంధం మాత్రం ఇంత తొందరగా ముగుస్తుందని అసలు ఊహించలేదని చెబుతోంది. తమ విడాకుల ప్రస్థానం ఒక బ్రేకప్ లా అనిపించిందని శ్వేతా బసు ప్రసాద్ తాజాగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ మ‌ళ్లీ నటనపై దృష్టి పెట్టింది. పలు వెబ్ సిరీస్ లలో శ్వేతా బసు ప్రసాద్ నటిస్తూ ఉంది.

Next Story