తారక్ బర్త్ డేకు సర్ ప్రైజ్ ఉందంటున్న ఆర్ఆర్ఆర్ టీమ్‌

Surprise From RRR Movie Team. రేపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్. చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది.

By Medi Samrat  Published on  19 May 2021 5:41 PM IST
NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్. సినిమాలో నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సినిమాలు వాయిదా పడ్డట్టే.. ఈ సినిమా కూడా వాయిదా పడుతూ వెళుతోంది. ఈ ఏడాది విడుదల అవుతుందా లేక వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయబోతోందా అన్న దానిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.


రేపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు ఆర్.ఆర్.ఆర్. సినిమా నుండి ఏదైనా పోస్టర్ వదులుతారేమోనని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. వారి కోసం ఆర్.ఆర్.ఆర్. చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. మే 20 ఉదయం 10 గంటలకు తాము తారక్ అభిమానులకో సర్ ప్రైజ్ ప్లాన్ చేశామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇక ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే అభిమానులు ట్విట్టర్ లో బర్త్ డే ట్రెండ్ ను మొదలు పెట్టారు. ఇక రేపు వీడియో వదిలినా.. పోస్టర్ వదిలినా.. భారీగా వైరల్ చేసేయడానికి రెఢీగా ఉన్నారు.

ఇక తన పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు సిద్దం అవుతున్న అభిమానులకు ఎన్టీఆర్ అభిమానుల‌కు లేఖ రాశారు. వేడుక‌ల‌కు ఇది స‌రైన స‌మ‌యం కాద‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్ నియ‌మాలు పాటించి ఇంటికే ప‌రిమితం కావాల‌ని కోరారు. ప్ర‌స్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని.. త్వ‌ర‌లోనే క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని పేర్కొన్నారు. అభిమానులంద‌రికి పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.


Next Story