నందమూరి అభిమానులకు సర్‌ప్రైజ్.. ఇదేనా..!
Surprise for Nandamuri fans. యన్టీఆర్ జయంతి అయిన మే 28న ఉదయం 9.44 గంటల తరువాత బాలకృష్ణ గానం చేసిన 'శ్రీరామదండకం' విడుదల కానుంది.
By Medi Samrat Published on
26 May 2021 10:26 AM GMT

మే 28.. ఈ డేట్ వింటే చాలు నందమూరి అభిమానులకు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారకరామారావు పుట్టినరోజు. సాధారణంగా ఆయన పుట్టినరోజును నందమూరి అభిమానులు పండుగలా జరుపుకుంటూ ఉంటారు. ఆయన పుట్టినరోజు నాడు ఆయన వారసుల సినిమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా వస్తూ ఉండేవి. మే 28న ఈ ఏడాది కూడా ఓ చిన్న సర్ ప్రైజ్ ఉందట..!
బాలకృష్ణకు సంబంధించిన నిర్మాణ సంస్థ ఎన్‌బీకే ఫిల్మ్స్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అందులో ఎన్టీఆర్ ఫొటోను ఉంచడంతో పాటు రేపు ఉదయం 8.45 గంటలకు ఓ చిన్న సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం అని ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 8.45కి రాబోతోందట. యన్టీఆర్ జయంతి అయిన మే 28న ఉదయం 9.44 గంటల తరువాత బాలకృష్ణ గానం చేసిన 'శ్రీరామదండకం' విడుదల కానుంది. యన్టీఆర్ పోషించిన శ్రీరాముని పాత్రల బొమ్మలపై బాలయ్య గానం చేసిన 'శ్రీరామదండకం' గద్యం పోస్ట్ చేసి వీడియోను విడుదల చేయనున్నారు. శ్రీరాముని పాత్రలో రామారావు బొమ్మలు, వాటిపై బాలయ్య గానం చేసిన 'శ్రీరామదండకం' గద్యం నందమూరి అభిమానులను అలరించనుంది.
Next Story