అభిమానిని తలుచుకుని బాధను వ్యక్తం చేసిన హీరో సూర్య

Suriya pays an emotional tribute to his fan Aishwarya. హీరో సూర్యకు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా భారీగా అభిమానులు ఉన్నారు.

By M.S.R  Published on  20 May 2023 3:45 PM IST
అభిమానిని తలుచుకుని బాధను వ్యక్తం చేసిన హీరో సూర్య

హీరో సూర్యకు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగులో భారీ ఎత్తున విడుదల అవుతూ ఉంటాయి. ఇక సూర్యకు తెలుగు అభిమానులంటే చాలా ఇష్టం. ఆయన ఇటీవల ఓ అభిమానిని కోల్పోయారు. ఆమెకు నివాళిని ఘటించారు సూర్య. తన అభిమాని చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయి మరెవరో కాదు ఇటీవల టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన తెలుగు అమ్మాయి తాటికొండ ఐశ్వర్య. మే 7న మధ్యాహ్నం టెక్సాస్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లోకి ఓ దుండగుడు చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్యతో పాటు మరో ఏడుగురు మృతి చెందారు. ఆ అమ్మాయి తనకు పెద్ద ఫ్యాన్ అని సూర్య తెలుసుకుని ఆమె కుటుంబానికి ఓ లేఖను పంపారు.

అనంతరం ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ లేఖను రాశారు. ఐశ్వర్య లేని లోటును తీర్చడం కష్టం.. ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదు. ఐశ్వర్య మృతి మనకు తీరని లోటు. ఆమె ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో బతికే ఉంటుందని ఐశ్వర్య తల్లిదండ్రును ఓదార్చాడు సూర్య. ఐశ్వర్య నువ్వు నిజమైన హీరోవి. నువ్వు చిందించే నవ్వు.. ప్రేమను పంచే నీ గుణం.. ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందని తెలిపారు. ఇది తాను ఆమెకు ఇస్తున్న నివాళి కాదని.. ఆమె పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు.


Next Story