ఎల్లుండే సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు.. బుర్రిపాలెంలో విషాద ఛాయలు

Superstar Krishna's last rites will be held on Thursday.సూపర్‌ స్టార్‌ కృష్ణ (79) కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.

By అంజి
Published on : 15 Nov 2022 12:47 PM IST

ఎల్లుండే సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు.. బుర్రిపాలెంలో విషాద ఛాయలు

సూపర్‌ స్టార్‌ కృష్ణ (79) కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు. కృష్ణ ఇక లేడని తెలిసి అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. కృష్ణ అంత్యక్రియలను గురువారం నిర్వహించాలని ఘట్టమనేని కుటుంబ సభ్యులు డెసిషన్‌ తీసుకున్నారు. మొదట రేపే అంత్యక్రియలను నిర్వహించాలనుకున్నారు. కానీ.. రేపు అష్ఠమి కావడంతో ఎల్లుండి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు.

పంజాగుట్ట మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇవాళ, రేపు ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఉంచనున్నారు. తెలంగాణ సర్కార్‌ అధికారిక లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరిపించే ఛాన్స్‌ ఉంది. ప్రభుత్వం నుంచి ఈ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కృష్ణ సొంత గ్రామమైన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ ఇంటి దగ్గర ఆయన చిత్రపటానికి పూల మాల వేసి గ్రామస్తులు నివాళులు అర్పించారు. కృష్ణ ఇక లేడన్న విషయం నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story