పవర్ స్టార్‌కు కరోనా.. సూపర్ స్టార్ రియాక్షన్ ఏంటంటే..?
Super star mahesh babu tweets on Pawan kalyan.దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి
By తోట వంశీ కుమార్ Published on 17 April 2021 9:53 AM ISTదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ క్షేమంగానే ఉన్నారని, త్వరలోనే ప్రజలు, అభిమానుల ముందుకు వస్తారని సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి. కాగా.. ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు.
Wishing you a speedy recovery @PawanKalyan. Get well soon! Strength and prayers 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) April 16, 2021
పవన్ కల్యాణ్ త్వరిగతిన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని తాను ప్రార్థిస్తున్నట్లు సూపర్ స్టార్ మహేష్‌బాబు ట్వీట్ చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంపై కూడా మహేష్ బాబు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కంబ్యాక్ చాలా అద్భుతంగా ఉంది. పవర్ ప్యాక్డ్ పర్‌ఫార్మెన్స్ కనబరిచారు అంటూ పవన్‌పై ప్రశంసలు కురిపించాడు మహేష్.
ఇటీవల తన వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారిన పడడంతో పవన్ కల్యాణ్ కొన్ని రోజుల నుంచి స్వీయ నిర్భందంలో ఉన్నారు. ఈ క్రమంలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందంటూ శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరడంతో ఆయనకు యాంటీ వైరల్ మందులతో చికిత్స అందిస్తున్నారు.