'మైఖేల్' వ‌చ్చేస్తున్నాడు

Sundeep Kishan's Michael to release on this date.యంగ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తున్న చిత్రం మైఖేల్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jan 2023 1:33 PM IST
మైఖేల్ వ‌చ్చేస్తున్నాడు

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా చిత్రాల‌ను చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు హీరో సందీప్ కిష‌న్‌. ఆయ‌న ప్ర‌స్తుతం నాలుగు చిత్రాల్లో న‌టిస్తున్నారు. అందులో ఒక‌టి 'మైఖేల్‌'. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి రంజిత్ జ‌య‌కోడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో సందీప్ స‌ర‌స‌న దివ్యాంశ కౌషిక్ న‌టిస్తోంది. వ‌రుణ్‌సందేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్, ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లోన‌టిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారిన యువ‌కుడి పాత్ర‌లో సందీప్‌కిష‌న్ క‌నిపించ‌బోతున్నాడు. వాస్త‌వానికి ఈ చిత్రం డిసెంబ‌ర్ 2022లో రావాల్సి ఉంది. అయితే.. క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో విడుద‌ల‌ను వాయిదా వేశారు.

Next Story