100 కోట్లు కొల్లగొట్టిన 'స్త్రీ-2'

శ్రద్ధా కపూర్‌, రాజ్‌కుమార్‌రావు జంటగా నటించిన 'స్త్రీ 2' బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే భారతదేశంలో రూ. 100 కోట్ల బెంచ్‌మార్క్‌ను దాటింది

By Medi Samrat  Published on  17 Aug 2024 5:46 PM IST
100 కోట్లు కొల్లగొట్టిన స్త్రీ-2

శ్రద్ధా కపూర్‌, రాజ్‌కుమార్‌రావు జంటగా నటించిన 'స్త్రీ 2' బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే భారతదేశంలో రూ. 100 కోట్ల బెంచ్‌మార్క్‌ను దాటింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల గ్రాస్‌తో రన్ అవుతుందని ట్రేడ్ వెబ్‌సైట్ Sacnilk నివేదించింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ హారర్-కామెడీ ఈ ఏడాది రెండు రోజుల్లో రూ.100 కోట్ల బిజినెస్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఈ సంవత్సరపు అతిపెద్ద బాలీవుడ్ ఓపెనర్ గా ఈ సినిమా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 బాలీవుడ్ చిత్రాలలో 'స్త్రీ 2' ఒకటి అవుతుందని భావిస్తున్నారు.

ఈ ఏడాది రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిన నాల్గవ బాలీవుడ్ చిత్రంగా 'స్త్రీ 2' నిలిచింది. ఈ జాబితాలో 'ఫైటర్' (రూ. 212.73 కోట్లు), 'షైతాన్' (రూ. 147.97 కోట్లు), 'ముంజ్యా' (రూ. 101.6 కోట్లు) ఉన్నాయి. 'స్త్రీ 2' ఈ వారాంతం ముగిసే సమయానికి రూ. 200 కోట్ల కలెక్షన్స్ కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. శని-ఆదివారం కలెక్షన్‌లో స్పష్టమైన వృద్ధిని చూడబోతోంది. ఇప్పటికే మెట్రో నగరాల్లో ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి.

Next Story