మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమా.. ఆస‌క్తిక‌ర అప్‌డేట్‌

SSMB 28 movie shooting will be starts from August.సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2022 12:11 PM IST
మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమా.. ఆస‌క్తిక‌ర అప్‌డేట్‌

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం ఇది. ఇంత‌క‌ముందు వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన 'అత‌డు', 'ఖ‌లేజా' లు క్లాసిక్ చిత్రాలుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో హ్యాటిక్ర్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. తాజాగా ఈ చిత్రంపై మేక‌ర్లు ఓ అప్‌డేట్‌ను ఇచ్చారు. వ‌చ్చే ఏడాది వేస‌వి కానుక‌గా ఈచిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఆగ‌స్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు గ్లింప్స్ వీడియోను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెటింట్ట వైర‌ల్‌గా మారింది. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది.

Next Story