ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్‌ ఎంట్రీ దక్కకపోవడంపై రాజమౌళి స్పందన‌

SS Rajamouli 'Disappointed' Over India's Oscar Entry. భారత్ నుండి ఆస్కార్ అధికారిక ఎంట్రీ దక్కకపోవడంపై రాజమౌళి స్పందించారు.

By Medi Samrat  Published on  20 Jan 2023 5:12 PM IST
ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్‌ ఎంట్రీ దక్కకపోవడంపై రాజమౌళి స్పందన‌

భారత్ నుండి ఆస్కార్ అధికారిక ఎంట్రీ దక్కకపోవడంపై రాజమౌళి స్పందించారు. ఆ విషయం చాలా బాధించిందని.. విదేశీయులు కూడా ఆర్.ఆర్.ఆర్. భారత్ నుండి అధికారికంగా ఆస్కార్ నామినేషన్స్ కి పంపబడితే బాగుండేదన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారని రాజమౌళి అన్నారు. దానికి మేము బాధపడుతూ కూర్చోలేదని.. చల్లో షో మూవీ ఎంపికైనందుకు మేము ఆనందించామన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు? అనేది తనకు తెలియదని అన్నారు.

ఆర్.ఆర్.ఆర్. సినిమా అనేక అంతర్జాతీయ అవార్డులు, గౌరవాలు అందుకుంది. ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేదికపై నాటు నాటు పాటకు అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే..! ప్రతి ఏడాది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ నామినేషన్స్ కి ఓ చిత్రాన్ని ఎంపిక చేసి పంపుతుంది. 2022లో విడుదలైన చిత్రాల్లో ఆర్.ఆర్.ఆర్. కి ఆ అవకాశం దక్కుతుందని అందరూ అనుకున్నారు. అయితే గుజరాతీ చిత్రం చల్లో షో(ది లాస్ట్ ఫిల్మ్ షో)కి ఆ అర్హత లభించింది.

Next Story