శ్రీలీల బర్త్‌ డే స్పెషల్‌.. మూడు సినిమాల ఫస్ట్‌లుక్‌ పోస్టర్ల రిలీజ్

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీ బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ముందు వరుసలో ఉంది. ఈ యువ హీరోయిన్‌ తన చివరి చిత్రం 'ధమాకా'లో

By అంజి
Published on : 14 Jun 2023 2:00 PM IST

Srileela, first look posters, Guntur Karam, Tollywood, Bhagavant Kesari

శ్రీలీల బర్త్‌ డే స్పెషల్‌.. మూడు సినిమాల ఫస్ట్‌లుక్‌ పోస్టర్ల రిలీజ్

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీ బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ముందు వరుసలో ఉంది. ఈ యువ హీరోయిన్‌ తన చివరి చిత్రం 'ధమాకా'లో రవితేజతో కలిసి ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన తర్వాత చాలా అవకాశాలను దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ చేతిలో ఇప్పుడు బోలేడన్నీ అవకాశాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు స్టార్ హీరోలతో కలిసి సినిమాలో చేస్తోంది ఈ బ్యూటీ. శ్రీలీల ఖాతాలో ప్రస్తుత భారీ బడ్జెట్, స్టార్ హీరో ప్రాజెక్ట్‌లు భగవంత్ కేసరి (బాలకృష్ణతో), గుంటూరు కారం (మహేష్ బాబుతో), ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్‌తో) కాగా.. ఇతర సినిమాలు ఆదికేశవ (పంజా వైష్ణవ్ తేజ్‌తో), బోయపాటి రాపో (రామ్ పోతినేనితో), నితిన్ 32 (నితిన్‌తో), VD12 ( విజయ్ దేవరకొండతో ) సినిమాల్లో నటిస్తోంది.

ఇవాళ శ్రీలీల పుట్టినరోజు, ఈ సందర్భంగా నటి రాబోయే చిత్రాల నిర్మాతలు పుట్టినరోజు పోస్టర్‌లను విడుదల చేశారు. భగవంత్ కేసరి, గుంటూరు కారం పోస్టర్లలో శ్రీలీల సాంప్రదాయకంగా కనిపిస్తుంది. గుంటూరు కారం నుండి వచ్చిన లుక్ మిర్చిలోని అనుష్క శెట్టిని పోలి ఉంది. బోయపాటి రాపో పుట్టినరోజు పోస్టర్‌లో శ్రీలీల పూర్తిగా మోడ్రన్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది. కేవలం రెండు సినిమాల అనుభవంతో మొదట్లోనే 7 నుంచి 8 సినిమాల్లో శ్రీలీలకు అవకాశాలు వచ్చాయి.

Next Story