ఆ వార్తల్లో నిజం లేదన్న బ్యానర్
Sri Venkateswara Creations Gives Clarity on rumours.మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ
By తోట వంశీ కుమార్ Published on 24 July 2022 6:54 AMమెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. రామ్‌చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫలానా నటీనటులు నటిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి చిత్ర బృందం ఇంకా ఎక్కడ అధికారికంగా వెల్లడించలేదు.
A note of caution to everyone #RC15 #SVC50 pic.twitter.com/KRPiykeCk2
— Sri Venkateswara Creations (@SVC_official) July 24, 2022
వీటితో పాటు ఈ ప్రాజెక్టులో నటించేందుకు నటీనటుల ఎంపిక జరుగుతోందన్న ప్రచారం ఊపందుకుంది.రోజు రోజుకి వార్తలు ఎక్కువ అవుతుండడంతో చిత్రబృందం తొలిసారిగా స్పందించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఆ వార్తలను తోసిపుచ్చింది. 'రామ్‌చరణ్- శంకర్ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అదంతా పూర్తి అబద్ధం. మా ప్రాజెక్ట్‌లో ఏదైనా పాత్ర కోసం నటీనటులను ఎంపిక చేసే అధికారం ఏ వ్యక్తికీ, ఏ ఏజెన్సీకి లేదు' అని స్పష్టం చేసింది. దయచేసి ఇలాంటి అసత్యపు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది.