పవన్‌పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్.. కాళ్లు పిసికి రుణం తీర్చుకుంటా..

Sri reddy targets pawan kalyan.క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో చాలా మంది సెల‌బ్రెటీలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 April 2021 7:42 AM GMT
పవన్‌పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్.. కాళ్లు పిసికి రుణం తీర్చుకుంటా..

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో చాలా మంది సెల‌బ్రెటీలు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానుల‌తో పాటు చాలా మంది సినీ ప్ర‌ముఖులు ట్వీట్లు చేస్తున్నారు. చికిత్స తీసుకుంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు రాగా.. దీనిపై రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస ట్వీట్లు హాట్ టాపిక్‌గా మార‌గా.. ఇంత‌లోనే న‌టి శ్రీరెడ్డి కూడా ప‌వ‌న్ టార్గెట్‌గా ఫేస్‌బుక్‌లో ప‌లు కామెంట్లు చేసింది.

'ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కల్యాణ్‌ను ఇలాంటి దయనీయ స్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా? చెప్పండి యువర్ ఆనర్' అంటూ పవన్‌పై ఆర్జీవీ తన ట్వీట్లను మొదలుపెట్టారు.

మరో ట్వీట్‌లో… 'హే పీకే ఫ్యాన్స్,వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్స్.. పవన్ కల్యాణ్ ఇలా మంచాన పడటానికి కోవిడ్ కారణం కాదు. వకీల్ సాబ్ కలెక్షన్లు అంటున్నారు. రండి,కదలండి,ప్రాణాలకు తెగించి పీకే జేబులు నింపండి…' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆర్జీవీ ట్వీట్లు అక్కడితో ఆగలేదు. పవన్ కల్యాణ్ బెడ్‌పై పడుకుని ఉన్న ఫోటోను ట్వీట్ చేసి… ఇందులో ఏదో తేడా కొడుతుంది అని కామెంట్ చేశారు. అంతేకాదు,ఇందులో తేడా ఏంటో మీ ఆర్ట్ డైరెక్టర్‌ సాబు సిరిల్‌ను అడగ్గలరా అంటూ రాజమౌళిని కూడా లాగారు.

ఇలా వ‌రుసగా రామ్‌గోపాల్ వ‌ర్మ ట్వీట్లు చేస్తుండ‌గా.. శ్రీరెడ్డి కూడా రంగంలోకి దిగింది. పవన్ బెడ్‌ పక్కన తాను కూర్చొన్నట్లుగా ఒక ఫోటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'పీకే పట్ల శ్రద్ద తీసుకునేందుకు ఆర్జీవీ సార్ నన్ను ఇక్కడ అపాయింట్ చేశారు. గురూజీకి నేను నా సేవలందిస్తాను. కాళ్లు పిసికి రుణం తీర్చుకుంటా. ముక్కు మాత్రం పిసకను గురూజీ.. ఊపిరి ఆడట్లేదంటా ఇప్పటికే… సదా మీ ఇద్దరి సేవలో..' అంటూ ఆ ఫోటోకి తన కామెంట్‌ను జతచేసింది.

Next Story
Share it