విజ్జి పాపకు చిచ్చా వున్నట్లు.. మా సినిమాకి ప్రేక్షకులు వున్నారు : శ్రీలీల

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

By Medi Samrat  Published on  20 Oct 2023 9:30 PM IST
విజ్జి పాపకు చిచ్చా వున్నట్లు.. మా సినిమాకి ప్రేక్షకులు వున్నారు : శ్రీలీల

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైంది. ఈ సినిమా అఖండ విజయం సాధించింది. మంచి కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

శ్రీలీల మాట్లాడుతూ.. భగవంత్ కేసరి విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది. ఈ సినిమాతో నన్ను చూసే విధానం మారిందని.. ఇంత చక్కని పాత్ర ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలిపింది. బాలకృష్ణ గారి సినిమాలో ఒక అమ్మాయికి ఫైట్ చేసే అవకాశం రావడం మామూలు విషయం కాదని తెలిపింది. విజ్జి పాపకు చిచ్చా వున్నట్లు.. మా సినిమాకి ప్రేక్షకులు వున్నారు. ఇంత మంచి కంటెంట్ ని అంతే గొప్పగా ఆదరిస్తున్నారని శ్రీలీల చెప్పుకొచ్చింది.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒకే మాట చెప్పాం. ఈ సినిమా శానా యేండ్లు యాదుంటాదని. అది ఈ రోజు నిజం చేశారు. చాలా సంతోషంగా వుందన్నారు. ఒక దర్శకుడిగా ‘భగవంత్ కేసరి’ సంపూర్ణమైన తృప్తిని ఇచ్చిందని అన్నారు. బాలకృష్ణ గారు తన కంఫర్ట్ జోన్ ని దాటి స్త్రీ సాధికారత గురించి వున్న ఈ కథని చేశారని.. ఈ సినిమాతో ఆయన హీరోగా మరింత ఎత్తుకు ఎదిగారన్నారు.

Next Story