'ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. కొత్త ప్రయాణం ప్రారంభం' : శ్రీజ ఆసక్తికర పోస్ట్
Sreeja Konidela instagram post viral.మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి
By తోట వంశీ కుమార్ Published on 3 Jan 2023 11:55 AM ISTమెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి అందరికి తెలిసిందే. ఆమె కళ్యాణ్‌దేవ్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా వీరిద్దరు వేరు వేరుగా ఉంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మధ్య కాలంలో వీరిద్దరు జంటగా కనిపించిన దాఖలు లేవు. ఇటీవల కూతురు పుట్టిన రోజును కూడా శ్రీజ ఒక్కతే సెలబ్రేట్ చేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో శ్రీజ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. డే టు డే లైఫ్, ఫిట్‌నెస్ గురించి ఎక్కువగా పోస్టులు పెడుతుంది.
అయితే.. తన జీవితంలో ఓ ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. "డియర్ 2022.. నా జీవితంలోని అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అని తెలిసేలా చేశావ్ అందుకు థాంక్స్. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి, నన్ను బాగా, అమితంగా ప్రేమించే వ్యక్తి, నన్ను ఎప్పుడూ కేరింగ్‌గా చూసుకునే వ్యక్తి, నాకు సపోర్టివ్‌గా ఉండే వ్యక్తి, నా కష్టసుఖాల్లో తోడుండే వ్యక్తి ఎవరో తెలుసుకోడం చాలా సంతోషంగా ఉంది. అది మరెవరో కాదు నేనే. నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్త ప్రయాణం మొదలైంది." అంటూ పోస్ట్ చేసింది.
కొత్త ప్రయాణం మొదలైంది అంటూ శ్రీజ చెప్పడంతో అటు మెగా అభిమానులతో పాటు ఇటు నెటీజన్లలో చర్చ మొదలైంది. ఇక కొందరు శ్రీజకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మీరు చెప్పింది అక్షర సత్యం. వ్యక్తిగత జీవితంలో ప్రేమే అన్నింటికన్నా ముఖ్యం. మనకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.