ఆ కేసుతో నాకు సంబంధం లేదు..అరెస్ట్ వారెంట్‌పై సోనూసూద్ ట్వీట్

తనపై లూథియానా కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యారు.

By Knakam Karthik
Published on : 7 Feb 2025 1:31 PM IST

National News, SonuSood, Ludhiana Court, Mumbai Police, Financial Fraud Case

ఆ కేసుతో నాకు సంబంధం లేదు..అరెస్ట్ వారెంట్‌పై సోనూసూద్ ట్వీట్

తనపై లూథియానా కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తోన్న వార్తలపై సంచలనాత్మకమైన విషయాలు స్పష్టం చేయాలని ట్వీట్ చేశారు. విషయం సూటిగా చెప్పాలంటే నాకు ఎలాంటి సంబంధం లేని అంశం విషయంలో కోర్టు నన్ను సాక్షిగా పిలిచింది. మా లాయర్లు కోర్టుకు సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరి 10వ తేదీన దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను. నా ప్రమేయం లేని విషయాలు మీ అందరికీ స్పష్టంగా వివరించాను. ఆ కేసుకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. సారీ.. మీడియా అనవసరంగా ఫోకస్ చేస్తోంది. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరం.. అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం సోనూసూద్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఫైనాన్షియల్ కేసులో లూథియానా కోర్టు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మోసం కేసులో మూలం ఇవ్వడానికి పంజాబ్‌లోని లూథియానా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్‌ ఖన్నా తనకు మోహిత్‌ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కైన్‌ పేరుతో తనతో పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయవాది సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు. సోనుసూద్‌కు పలుమార్లు సమన్లు ​​పంపించేందుకు అతను హాజరుకాలేదు. దీంతో విచారణ జరిగింది కోర్టు సోనూసూద్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

Next Story