యాక్షన్ సీక్వెన్స్ కోసం శిక్షణ తీసుకుంటూ గాయ‌ప‌డ్డ‌ హీరోయిన్

Sonal Chauhan fractures foot while training for Nagarjuna's The Ghost. అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'ది ఘోస్ట్‌'లో యాక్షన్ సీక్వెన్స్ కోసం శిక్షణ

By Medi Samrat  Published on  16 Sept 2022 8:30 PM IST
యాక్షన్ సీక్వెన్స్ కోసం శిక్షణ తీసుకుంటూ గాయ‌ప‌డ్డ‌ హీరోయిన్

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'ది ఘోస్ట్‌'లో యాక్షన్ సీక్వెన్స్ కోసం శిక్షణ తీసుకుంటున్నప్పుడు హీరోయిన్ సోనాల్ చౌహాన్ పాదానికి ఫ్రాక్చర్ అయింది. వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించినప్పటికీ.. సోనాల్ కాలుకి కట్టుతో శిక్షణను కొనసాగించింది. కాలుకు ఫ్రాక్చర్ తో ఉన్న సోనాల్ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సోనాల్ చౌహాన్ 'ది ఘోస్ట్‌' సినిమాలో ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రను పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. MMA ట్రైనింగ్ సెషన్‌లో, సోనాల్ పాదానికి ఫ్రాక్చర్ అయింది మరియు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆరు వారాల పాటు శిక్షణ లేదా షూటింగ్‌కు దూరంగా ఉండాలని డాక్టర్ ఆమెను కోరారు. అయినప్పటికీ ఆమె కాలుకు కట్టుతో షూటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. సోనాల్ తన శిక్షణను పూర్తి చేసి యాక్షన్ సన్నివేశాన్ని ముగించింది. నటీనటులు, సిబ్బంది సోనాల్ అంకితభావాన్ని ప్రశంసించారు.

నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న చిత్రం ది ఘోస్ట్. సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవివర్మ, బిలాల్ హొస్సేన్ సహాయక పాత్రల్లో కనిపించారు. అక్టోబ‌ర్ 5న ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.. ఘోస్ట్ టీజ‌ర్ ఇటీవలే విడుదలై.. ప్రేక్షకాదరణ పొందింది.


Next Story