NANI 31: కీ రోల్‌లో నటించనున్న యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌

త్వరలోనే 'హాయ్‌ నాన్న' మూవీతో సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన నేచురల్‌ స్టార్‌ నాని.. మరో సినిమాను పట్టాలెక్కించాడు.

By అంజి  Published on  22 Oct 2023 1:30 PM IST
SJ Suryah, Nani31, Tollywood, VivekAthreya, DVVMovies

NANI 31: కీ రోల్‌లో నటించనున్న యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌

త్వరలోనే 'హాయ్‌ నాన్న' మూవీతో సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన నేచురల్‌ స్టార్‌ నాని.. మరో సినిమాను పట్టాలెక్కించాడు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో గతంలో నాని 'అంటే సుందరానికి' సినిమా చేసిన విషయం తెలిసిందే. కాగా వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌లో ఈ కొత్త సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం మారోసారి ఇద్దరు చేతులు కలిపారు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాని తెరకెక్కించనుంది. కాగా ఈ సినిమాలో టాలెంటెడ్‌ దర్శకుడు, నటుడు ఎస్‌ జే సూర్య కీలక పాత్రలో నటించబోతున్నారు.

దీనిపై మేకర్స్‌ నుండి కూడా క్లారిటీ వచ్చింది. సినిమా యూనిట్‌ ఎస్‌జే సూర్య పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేసింది. నాని, ఎస్‌జే సూర్య కాంబినేషన్‌ ఎలా ఉంటుందనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎస్‌జే సూర్య చిత్రాలలో తన అసాధారణ పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. కాగా ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా ధృవీకరించబడింది. ఈ సినిమాలో నటీనటుల ఎంపికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

Next Story