తాతయ్య కృష్ణ మరణంతో సితార భావోద్వేగం.. ఎమోషనల్‌ పోస్ట్‌

Sithara's emotional post on Superstar Krishna's death. సూపర్‌స్టార్‌ కృష్ణ మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

By అంజి  Published on  16 Nov 2022 2:32 PM IST
తాతయ్య కృష్ణ మరణంతో సితార భావోద్వేగం.. ఎమోషనల్‌ పోస్ట్‌

సూపర్‌స్టార్‌ కృష్ణ మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి, అన్నయ్య దూరం కావడంతో ఇప్పటికే తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన మహేష్‏కు ఇప్పుడు తండ్రి కృష్ణ కూడా దూరం కావడంతో ఆయనను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇదిలా ఉంటే మహేష్‌ బాబు కుమార్తె సితార.. తన తాత కృష్ణ మరణంతో భావోద్వేగానికి గురయ్యారు. తాతయ్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇవాళ ఓ పోస్టు పెట్టారు. తాత కృష్ణతో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు.

''ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాత గారు.. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటా. మిమ్మల్ని బాగా మిస్‌ అవుతున్నా'' అని సితార తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెటిజన్ల హృదయాన్ని కదిలిస్తోంది. 'బి స్ట్రాంగ్ సితూ పాప' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మహేశ్‌బాబు తన తండ్రి మరణాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.


Next Story