'సీతారామం' హిందీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడో తెలుసా?

Sitaramam movie Hindi release date fixed by makers. దుల్కర్‌ సల్మాన్‌, మృనాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన 'సీతారామం' సినిమా భారీ విజయం సాధించిన

By అంజి  Published on  26 Aug 2022 5:25 PM IST
సీతారామం హిందీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడో తెలుసా?

దుల్కర్‌ సల్మాన్‌, మృనాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన 'సీతారామం' సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. ఇక బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు కూడా రాబట్టింది. కల్యాణ్‌ రామ్‌ 'బింబిసార' మూవీ నుంచి గట్టి పోటీ ఎదురైనా బాక్సాఫీస్‌ దగ్గర రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది. దక్షిణాదిన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో.. మేకర్స్‌ హిందీ మార్కెట్‌ క్యాష్‌ చేసుకోవాలని నిర్ణయించారు. త్వరలోనే హిందీలో ఈ సినిమా రిలీజ్‌ చేయబోతున్నారు.

సెప్టెంబర్‌ 2న సీతా రామం హిందీలో రిలీజ్‌ కానున్నట్లు మేకర్స్‌ శుక్రవారం ట్విటర్‌ ద్వారా ప్రకటన చేశారు. "తెలుగు బ్లాక్‌బస్టర్‌ 'సీతా రామం' సెప్టెంబర్‌ 2 నుంచి హిందీలోనూ మిమ్మల్ని మెస్మరైజ్‌ చేయబోతోంది" మేకర్స్‌ చెప్పారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ రొమాంటిక్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ యుద్ధంతో రాసిన ప్రేమ కథ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇందులో దుల్కర్‌, మృనాల్ కెమెస్ట్రీ అందరికీ నచ్చింది. ఇక అఫ్రీన్‌ క్యారెక్టర్‌లో రష్మిక కూడా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. తరుణ్‌ భాస్కర్‌, అక్కినేని సుమంత్‌ కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.


Next Story